Gold rate: మరింత త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు!

  • రూ.275 తగ్గి రూ.30,275గా న‌మోదైన‌ పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధ‌ర
  • రూ.525 త‌గ్గి రూ.39,925గా న‌మోదైన కిలో వెండి ధ‌ర‌
  • పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి తగ్గిన డిమాండ్

అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక వ్యాపారుల దగ్గర నుంచి డిమాండ్ ప‌డిపోవ‌డంతో బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. ఈ రోజు మార్కెట్లో ప‌సిడి ధ‌ర రూ.275 తగ్గి, పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.30,275గా న‌మోదైంది. మ‌రోవైపు వెండి ధ‌ర కూడా ప‌డిపోయింది. కిలో వెండి ధ‌ర‌ రూ.525 తగ్గి, రూ.39,925గా న‌మోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ త‌గ్గ‌డంతో వెండి ధ‌ర త‌గ్గింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కాగా, గ్లోబ‌ల్ మార్కెట్లో ప‌సిడి ధ‌ర 0.04 శాతం తగ్గి ఔన్సు 1,265.70 డాలర్లుగా న‌మోదైంది. 

More Telugu News