amma: స్కూటీపై త‌న పిల్ల‌ల‌కు సైతం హెల్మెట్ పెట్టి తీసుకెళ్తోన్న అమ్మ ఫొటో!

  • షేర్ చేసిన హైద‌రాబాద్ పోలీసులు
  • హెల్మెట్ త‌ప్ప‌కుండా పెట్టుకోవాల‌ని సూచ‌న‌
  • ఆకర్షిస్తోన్న ఫొటో

ద్విచ‌క్ర వాహ‌నం ప్ర‌మాదానికి గురైన‌ప్పుడు ఆ వాహ‌న చోద‌కుడు హెల్మెట్ పెట్టుకుని ఉంటే త‌ల‌కి దెబ్బ త‌గ‌ల‌ద‌ని, ప్రాణాలు కాపాడుకోవ‌చ్చ‌ని పోలీసులు సూచిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకుని ప్ర‌యాణించాలంటూ ట్రాఫిక్ పోలీసులు ఎంత‌గా ప్ర‌చారం చేస్తోన్నా వాహ‌న‌దారులు మాత్రం వారి మాట‌ల‌ను వినిపించుకోవడం లేదు. ఈ క్రమంలో ఈ రోజు హైద‌రాబాద్ పోలీసులు త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది.

ఈ ఫొటోలో ఓ త‌ల్లి స్కూటీపై త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళుతోంది. ద్విచ‌క్ర వాహ‌నాన్ని న‌డిపించేట‌ప్పుడు తాను హెల్మెట్ పెట్టుకోవ‌డ‌మే కాకుండా తన ఇద్ద‌రు పిల్ల‌లకు కూడా హెల్మెట్ పెట్టి తీసుకెళుతోంది. ఆ స్కూటీ ప‌క్క నుంచే మ‌రో ద్విచ‌క్ర‌వాహ‌నం వెళుతోంది. ఆ వాహ‌నాన్ని నడుపుతోన్న వ్య‌క్తి మాత్రం హెల్మెట్ పెట్టుకోలేదు.  

More Telugu News