oxford dictionaty: గులాబ్ జామున్, గల్లీ, మిర్చి మసాలా... ఆక్స్‌ఫ‌ర్డ్ డిక్ష‌న‌రీలో స్థానం సంపాదించుకున్న 70 భార‌తీయ ప‌దాలు

  • సెప్టెంబ‌ర్ అప్‌డేష‌న్‌లో భాగంగా చేర్చిన ఆక్స్‌ఫ‌ర్డ్‌
  • ఖీమా, మిర్చి, న‌మ్కీన్‌, వ‌డ వంటి వంట‌ల పేర్లు
  • దాదాగిరి, చెంచా, జుగాడ్‌, నాయీ ప‌దాలు కూడా

ఆక్స్‌ఫ‌ర్డ్ డిక్ష‌న‌రీ సెప్టెంబ‌ర్ 2017 అప్‌డేష‌న్‌లో భాగంగా 70 భారతీయ ప‌దాల‌ను డిక్ష‌న‌రీలో పొందుప‌రిచారు. వీటిలో గులాబ్ జామున్‌, గ‌ల్లీ, మిర్చి మ‌సాలా, అన్న‌, బాపు, అబ్బ, సూర్య న‌మ‌స్కార్‌ ప‌దాలు కూడా ఉన్నాయి. డిక్ష‌న‌రీలో ఇప్ప‌టికే Anna అనే ప‌దం ఉంది. దీని అర్థం... స్వాతంత్ర్యానికి ముందు అందుబాటులో ఉన్న క‌రెన్సీ అణా. ఇప్పుడు చేర్చిన Anna ప‌దానికి అర్థంగా `అన్న‌య్య‌` అని ఆక్స్‌ఫ‌ర్డ్ పేర్కొంది.

ఇక భార‌తీయ వంట‌కాలైన ఖీమా, మిర్చి, మిర్చి మ‌సాలా, న‌మ్కీన్, వ‌డ‌ ప‌దాల‌ను ఆక్స్‌ఫ‌ర్డ్ పొందుప‌రిచింది. ఈ 70 ప‌దాల‌తో క‌లిపి ఆక్స్‌ఫ‌ర్డ్ డిక్ష‌న‌రీలో ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 900కి పైగా భార‌తీయ ప‌దాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాగిరి, చెంచా, జుగాడ్‌, నాయీ, నివాస్‌, ఖిల్లా, ఉద్యోగ్ వంటి ప‌దాలు కూడా ఆక్స్‌ఫ‌ర్డ్ డిక్ష‌న‌రీలో స్థానం సంపాదించుకున్నాయి.

More Telugu News