tamanna: చిట్టి రోబోగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా!

  • స్ఫూర్తిగా నిలిచిన ర‌జ‌నీకాంత్‌కి ట్రిబ్యూట్ అంటూ వ్యాఖ్య‌
  • ఫ‌రాఖాన్ `లిప్ సింగ్ బ్యాటిల్‌`లో పాల్గొన్న త‌మ‌న్నా
  • క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్‌తో క‌లిసి పాల్గొన్న మిల్కీ బ్యూటీ

చిట్టి రోబో గెట‌ప్‌లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అదరగొట్టింది. బాలీవుడ్‌ దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ‘లిప్‌ సింగ్‌ బ్యాటిల్‌’ అనే కార్య‌క్ర‌మం కోసం త‌మ‌న్నా ఈ గెట‌ప్ వేసుకుంది. క్రికెటర్ ఇర్ఫాన్ ప‌ఠాన్‌తో క‌లిసి ఆమె ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంది. రోబో గెటప్‌లో ఉన్న ఫొటోను తమన్నా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘నాకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తిగా నిలిచిన రజనీకాంత్‌కి ఇది నా ట్రిబ్యూట్‌. నా జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి క్లిష్టమైన పాత్రలో నటించలేదు’ అని పేర్కొంది.

రోబో గెట‌ప్‌లో ర‌జ‌నీని అనుకరిస్తూ త‌మ‌న్నా షోలో చేసిన అల్ల‌రి తెలుసుకోవాలంటే ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌య్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇటీవ‌ల ఈ కార్య‌క్ర‌మంలో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఆడిపాడిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే శిల్పా శెట్టి, ర‌వీనా టాండ‌న్‌, షారుక్ ఖాన్‌, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి బాలీవుడ్ తార‌లు పాల్గొన్నారు. పాట‌లు పాడుతూ ఆయా గెట‌ప్‌లు వేసుకుని డ్యాన్సులు చేయ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం కాన్సెప్ట్. ఓ ఇంగ్లిష్ ఛాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌య్యే `లిప్ సింక్ బ్యాటిల్‌` కార్య‌క్ర‌మం ఆధారంగా ఈ షోను రూపొందించారు.

More Telugu News