bcci: ఓ భారత క్రికెటర్ డోపీ... సంచలన రిపోర్టు ఇచ్చిన 'వాడా'!

  • పేరును వెల్లడించని 'వాడా'
  • 153 మందికి పరీక్షలు
  • క్రికెటర్ పట్టుబడటం రెండోసారి
  • గతంలో దొరికిపోయిన ప్రదీప్ సంగ్వాన్

బీసీసీఐ నుంచి గుర్తింపు పొందిన క్రికెటర్లలో ఓ క్రికెటర్ నిషేధంలో ఉన్న ఉత్ర్పేరకాలు వాడినట్టు వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ అసోసియేషన్) సంచలన నివేదిక ఇచ్చింది. బీసీసీఐ నుంచి 153 మంది క్రికెటర్లు గుర్తింపు పొంది ఉండగా, దేశవాళీ మ్యాచ్ లలో భాగంగా వారి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు జరిపారు. వారిలో ఒకరు డోపీ అని చెప్పిన వాడా, అతని పేరును మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.

 డోపింగ్ లో ఓ భారత క్రికెటర్ పట్టుబడటం ఇది రెండోసారి. గతంలో 2013 ఐపీఎల్ సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తే, ప్రదీప్ సంగ్వాన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇంతవరకూ క్రికెట్ మినహా ఇతర ఆటల్లోనే డోపింగ్ అన్న పదం ఎక్కువగా వినపడుతూ ఉండేదన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు క్రికెట్ కూ ఆ మహమ్మారి పాకుతోందన్న సంకేతాలు వాడా తాజా రిపోర్టుతో వస్తున్నాయి.

More Telugu News