nara rohith: వెంకటేశ్ కి విలన్ గా నారా రోహిత్ ను మార్చేస్తోన్న తేజ!

  • తేజ చేతికి ఎన్టీఆర్ బయోపిక్ 
  • అంతకన్నా ముందుగా వెంకటేశ్ తో సినిమా 
  • కథానాయికగా అనుష్క చేసే ఛాన్స్ 
  • పరిశీలనలో 'ఈ నగరానికి ఏమైంది?' టైటిల్

ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన బాధ్యతను దర్శకుడిగా తేజకి బాలకృష్ణ అప్పగించారు. ఈ సినిమాకి 'ఎన్టీఆర్' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టు కంటే ముందుగా వెంకటేశ్ తో ఒక సినిమా చేయడానికి తేజ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం 'ఈ నగరానికి ఏమైంది?' అనే టైటిల్ ను పరిశిలీస్తున్నట్టుగా సమాచారం.

ఇక కథానాయికాగా అనుష్కను తీసుకునే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం నారా రోహిత్ విలన్ గా మారుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా ప్రత్యేకంగా వుంటుందట. ఆ పాత్రకి నారా రోహిత్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని భావించిన తేజ, ఆయనని ఒప్పించాడని అంటున్నారు. హీరోగా వరుస సినిమాలు చేస్తోన్న నారా రోహిత్ .. ఈ సినిమాలో విలన్ గా చేయడానికి ఓకే అనడం విశేషమే. 

More Telugu News