subramanian swamy: సుబ్రహ్మణ్యస్వామికి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు... పిటిషన్ కొట్టివేత

  • సమాచారాన్ని స్వామి రహస్యంగా ఉంచారన్న కోర్టు
  • స్వామి పిటిషన్ కొట్టివేత
  • స్వామి ఆరోపణలను ఖండించిన ఢిల్లీ పోలీసులు

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మరణంపై ఆయన వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. స్వామి వేసిన పిటిషన్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ లా కాకుండా పొలిటికల్ ఇంటరెస్ట్ లిటిగేషన్ లా ఉందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. సునంద మరణం కేసులో తొలిసారి చెప్పిన సమాచారాన్ని ఆ తర్వాత స్వామి దాచిపెట్టారని తెలిపింది. కోర్టుకు సమర్పించిన అంశాలను స్వామి రహస్యంగా ఉంచారని పేర్కొంది. మరోవైపు సునంద మృతి కేసు విచారణను థరూర్ ప్రభావితం చేశారన్న సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు తెలిపారు.

సునంద మృతి కేసును సీబీఐ ప్రత్యేక బృందం చేత దర్యాప్తు జరిపించాలని... ఈ దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో జులై మొదటి వారంలో స్వామి పిల్ దాఖలు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతను మరో అప్లికేషన్ ను కోర్టులో దాఖలు చేశారు. చార్జ్ షీట్ కు సంబంధించిన కాపీ ఇప్పించాలని ఈ సందర్బంగా ఆయన కోర్టును కోరారు. సాక్ష్యాలను సేకరించడంలో వైఫల్యం, ఎయిమ్స్ కు సహరించకపోవడం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి ఆరోపణలను ఈ పిటిషన్ ద్వారా ఢిల్లీ పోలీసులపై గుప్పించారు స్వామి. ఈ నేపథ్యంలో, చివరకు స్వామి పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. 

More Telugu News