అభిమాని ట్వీట్‌కి స్ప‌ష్టంగా స‌మాధానం ఇచ్చిన రేణూ దేశాయ్‌!

Thu, Oct 26, 2017, 03:24 PM
  •  స్టార్ మా టీవీలో ప్ర‌సారం అవుతోన్న 'నీతోనే డ్యాన్స్' షో
  •  షోలో డ్యాన్స్ చేస్తోన్న వారు సీరియ‌ళ్లు చేసుకుంటే బాగుంటుంద‌ని అభిమాని ట్వీట్‌
  • ఈ షో ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని రేణూ స‌మాధానం
  • డ్యాన్స‌ర్‌ల‌కు పెడుతోన్న పోటీకి సంబంధించినది కాద‌ని వివ‌ర‌ణ
స్టార్ మా టీవీలో ప్ర‌సారం అవుతోన్న 'నీతోనే డ్యాన్స్' అనే కార్య‌క్ర‌మానికి న‌టి, ప్రొడ్యూస‌ర్ రేణూ దేశాయ్ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న విష‌యం తెలిసిందే. అప్పుడ‌ప్పుడు భావోద్వేగంతో ట్వీట్లు చేసే ఆమె.. తాజాగా ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు కూల్ గా స‌మాధానం ఇచ్చింది. 'నీతోనే డ్యాన్స్‌'షోలో పాల్గొనేవారికి అసలు డ్యాన్సే రాదని ఆ అభిమాని రేణూ దేశాయ్‌కి ట్వీట్ చేశాడు.

వారంతా టీవీ సీరియ‌ళ్లు చేసుకుంటేనే బాగుంటుంద‌ని, వారిని డ్యాన్సర్లుగా చూడలేకపోతున్నామని అన్నాడు. దీంతో ఆ అభిమానికి జవాబిచ్చింది. ఈ ప్రోగ్రామ్ డ్యాన్స‌ర్‌ల‌కు పెడుతోన్న పోటీకి సంబంధించినది కాద‌ని చెప్పింది. ఇది వినోదం కోసం చేస్తున్నదేన‌ని, నిజ జీవిత సెలబ్రిటీ జంటలతో కలిసి చేస్తున్న షో అని ఆమె వివ‌రించి చెప్పింది. ఈ షో ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని పేర్కొంది.  
Tags: RenuTweet
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad