ratings: టీవీలో అత్య‌ధిక రేటింగ్స్ రాబ‌ట్టిన మొద‌టి మూడు సినిమాలు ఇవే!

  • బాహుబ‌లి-1 సినిమాకి 23 టీఆర్పీ
  • బాహుబ‌లి-2 సినిమా 22.7
  • మూడో స్థానంలో అల్లు అర్జున్ సినిమా దువ్వాడ జ‌గ‌న్నాథం

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిభ‌తో తెలుగు సినిమా స‌త్తా ప్ర‌పంచానికి తెలిసి వ‌చ్చింది. ఆయ‌న తీసిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్దే కాదు.. బుల్లి తెర విష‌యంలోనూ రికార్డులు సృష్టిస్తున్నాయి. బాహుబ‌లి-1 సినిమాకి ఏకంగా 23 టీఆర్పీ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇంత‌వ‌ర‌కు టీవీల్లో అత్య‌ధిక రేటింగ్స్ సాధించిన సినిమాల్లో అది మొదటి స్థానంలో నిల‌వ‌గా రాజ‌మౌళి తీసిన బాహుబ‌లి-2 సినిమా 22.7 టీఆర్పీతో రెండో స్థానంలో ఉంది.

ఇక మూడో స్థానంలో అల్లు అర్జున్ సినిమా దువ్వాడ జ‌గ‌న్నాథం నిలిచింది. ఈ సినిమాకి 21.70 టీఆర్పీ వ‌చ్చింది. కాగా, బాహుబ‌లి-2 సినిమాను ఇటీవ‌లే ఆ సినిమా యూనిట్ యూ ట్యూబ్‌లో ఉంచింది. అత్య‌ధిక వ్యూస్‌తో ఆ సినిమా దూసుకుపోతోంది. గ‌తంలో రాజ‌మౌళి తీసిన 'ఈగ' సినిమాకు కూడా టీవీలో అత్య‌ధిక రేటింగ్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

More Telugu News