venkatesh: తేజ .. వెంకీ కాంబినేషన్లో 'ఈ నగరానికి ఏమైంది'?

  • తేజతో వెంకటేశ్ నెక్స్ట్ మూవీ 
  • వచ్చేనెల 16 నుంచి మొదలు 
  • కథానాయికగా అనుష్క?  

సురేశ్ ప్రొడక్షన్స్ .. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు కొన్ని సినిమాలను సంయుక్తంగా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ సంస్థలు చేపట్టే ప్రాజెక్టులు మూడు నాలుగు లైన్లో వున్నాయి. వాటిలో ఒక సినిమా కోసం ' ఈ నగరానికి ఏమైంది'? అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. ఆల్రెడీ ఈ మాట జనంలో బాగా నానుతోన్న సంగతి తెలిసిందే.

 అలాంటి ఈ టైటిల్ వెంకటేశ్ సినిమా కోసమేననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. వెంకటేశ్ కథానాయకుడిగా దర్శకుడు తేజ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను వచ్చేనెల 16వ తేదీన లాంచ్ చేయనున్నారు. వెంకటేశ్ సరసన కథానాయికగా అనుష్క చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమా తరువాత తేజ ఎన్టీఆర్ బయోపిక్ చేయనుండగా, వెంకటేశ్ ఓ మల్టీ స్టారర్ చేయనున్నారు.            

More Telugu News