nithin: నితిన్ తోనే మేఘ ఆకాశ్ సినిమాలు .. ఇద్దరూ ప్రేమలో పడ్డారంటూ ప్రచారం!

  • 'లై' మూవీలో నితిన్ జోడీ కట్టిన మేఘ ఆకాశ్ 
  • నితిన్ తదుపరి చిత్రంలోను ఆమెనే హీరోయిన్
  • ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందనే టాక్ 
  • పెళ్లి చేసుకోవాలనే ఆలోచన  

టాలీవుడ్లో దూసుకుపోతోన్న యువ కథానాయకులలో నితిన్ ఒకరు. ప్రస్తుతం ఆయన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా మేఘ ఆకాశ్ నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి 'లై' సినిమా చేశారు. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య పరిచయం .. ప్రేమగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనీ .. అందుకు నితిన్ పేరెంట్స్ కూడా సానుకూలంగా వున్నారనే ప్రచారం జరుగుతోంది. పెళ్లి ఆలోచన కారణంగానే మేఘ ఆకాశ్ వేరే సినిమాలను ఒప్పుకోవడం లేదని చెప్పుకుంటున్నారు. అయితే ఇంతవరకూ ఈ ప్రచారాన్ని ఈ ఇద్దరిలో ఎవరూ ఖండించలేదు. సాధారణంగా ఒక హీరో - ఒక హీరోయిన్ వెంటవెంటనే సినిమాలు చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అలాంటిదే ఈ ప్రచారం కూడా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నవాళ్లూ లేకపోలేదు.       

More Telugu News