huwai: వింత చట్టం.. ఆ నగరంలో స్మార్ట్ ఫోన్ చూస్తూ నడిస్తే నేరమే!

  • వీధుల్లో నడుస్తూ స్మార్ట్ ఫోన్ వినియోగించడంపై నిషేధం విధించిన హవాయి ప్రభుత్వం
  •  హోనోలులు నగరంలో నిన్నటి నుంచి అమలులోకి వచ్చిన నిషేధం
  • వీధుల్లో ఫోన్ వినియోగిస్తూ నడిస్తే 35 డాలర్ల (2,200 రూపాయలు) జరిమానా

స్మార్ట్ ఫోన్ లేనిదే తెల్లారడం లేదు. నిత్యజీవితంలో ఫోన్ ఒక నిత్యావసర వస్తువైపోయింది. ఫోన్ లేనిదే పొద్దుపోవడం లేదు. నడుస్తున్నా, పని చేస్తున్నా, ఆఖరుకి భోజనం చేస్తున్నా ఫోన్ పక్కనుండాల్సిందే. అంతలా ఫోన్ నిత్యజీవితంలో భాగమైపోయింది.

ఈ నేపథ్యంలో నడుస్తూ ఫోన్ వినియోగించడాన్ని హోనోలులు నగరంలో నిషేధం విధించారు. హవాయిలోని హోనోలులు నగరంలో నడిచేప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు చూడటాన్ని నిషేధిస్తూ కొత్తచట్టాన్ని తీసుకొచ్చారు. వీధుల్లో ఫోన్ ను వినియోగిస్తూ నడవడం వల్ల పలువురు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొంటూ, హవాయి ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ చట్టం చేసింది. ఈ చట్టం నిన్నటి నుంచి అమలులోకి వచ్చింది. దీంతో నడుస్తూ ఎవరైనా ఫోన్ వినియోగిస్తే వారికి 35 డాలర్ల (2,200 రూపాయలు) జరిమానా విధించనున్నారు.

More Telugu News