stock market: బ్యాంకుల అండతో బుల్ రంకెలు.. స్టాక్ మార్కెట్లో లాభాల పంట!

  • ప్రభుత్వ బ్యాంకులకు రీక్యాప్ ప్రకటించిన కేంద్రం
  • దూసుకుపోయిన ప్రభుత్వ బ్యాంకుల షేర్లు
  • 435 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. ఇవాల్టి ట్రేడింగ్ ప్రారంభం నుంచే దూసుకెళ్లిన మార్కెట్లు, మధ్యాహ్నం తర్వాత మరోసారి హైజంప్ చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 2.11 లక్షల కోట్ల రీక్యాప్ ప్లాన్ ను మోదీ సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో, బ్యాంకు షేర్లు లాభాల్లో దూసుకుపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 435 పాయింట్ల లాభంతో 33,042కి పెరిగింది. నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,295కు చేరుకుంది.

బీఎస్ఈ లో ఇవాల్టి టాప్ గెయినర్స్...
 పంజాబ్ నేషనల్ బ్యాంక్ (46.20%), కెనరా బ్యాంక్ (38.05%), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (34.07%), బ్యాంక్ ఆఫ్ ఇండియా (33.96%), బ్యాంక్ ఆఫ్ బరోడా (31.47%).

టాప్ లూజర్స్...    
ఎడిల్ వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (-8.26%), చోళమండలం ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఫైనాన్స్ (-7.15%), ఎల్ అండ్ టీ ఫైనాన్స్ (-6.97%), కెన్ ఫైనాన్స్ హోమ్స్ (-6.40%), ఎస్ బ్యాంక్ (-5.92%).

More Telugu News