ghoomar: ఘూమ‌ర్ నృత్యం అద‌ర‌గొట్టిన దీపికా ప‌దుకొనే... `ప‌ద్మావ‌తి` ఫ‌స్ట్ వీడియో సాంగ్ విడుద‌ల‌

  • రాజ్‌పుత్ రాణుల వైభ‌వాన్ని చూపించిన భ‌న్సాలీ
  • డ్యాన్స్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డిన దీపిక‌
  • వైర‌ల్‌గా మారుతున్న వీడియో సాంగ్‌

షాహిద్ క‌పూర్‌, ర‌ణ్‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనే ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన `ప‌ద్మావ‌తి` చిత్రంలోని మొద‌టి పాట వీడియోను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. `ఘూమ‌ర్‌` పేరుతో విడుద‌ల చేసిన ఈ పాట‌ను రాజ‌స్థాన్ సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక‌గా విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర‌యూనిట్ పేర్కొంది.

వారు పేర్కొన్న‌ట్లుగానే పాట వీడియో చాలా అద్భుతంగా ఉంది. రాజ్‌పుత్ రాణులు మ‌హారాజుల వ‌ద్ద ప్ర‌ద‌ర్శించే సంప్ర‌దాయ నృత్య‌మైన `ఘూమ‌ర్‌` స్టెప్పుల‌ను ప‌ద్మావ‌తి పాత్ర పోషిస్తున్న దీపికా ప‌దుకొనే అద‌రగొట్టింది. ఈ నృత్యం కోసం దీపికా గంట‌ల త‌ర‌బడి క‌ష్ట‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ఈ పాట‌ను మెలోడీ క్వీన్ శ్రేయ ఘోష‌ల్ ఆల‌పించారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ సంగీతం ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన గంట‌ల్లోనే ఈ వీడియోకు ల‌క్షకు పైగా వీక్ష‌ణ‌లు వ‌చ్చాయి. డిసెంబ‌ర్ 1న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది.

More Telugu News