priyanka chopra: `గుడ్డు ప‌గ‌ల‌కుండా కింద ఎలా ప‌డేయాలో తెలుసా?`... ప్రియాంక చోప్రాను అడిగిన నెటిజ‌న్‌

  • ట్విట్టర్లో 20 మిలియ‌న్ ఫాలోవ‌ర్ల మార్క్ దాటిన పీసీ
  • #AskPC అంటూ అభిమానుల‌తో ముచ్చ‌టించిన ప్రియాంక
  • వివిధ ప్ర‌శ్న‌లు సంధించిన నెటిజ‌న్లు

ట్విట్ట‌ర్‌లో 20 మిలియ‌న్ ఫాలోవ‌ర్ల మార్క్ దాటిన సంద‌ర్భంగా అంత‌ర్జాతీయ న‌టి ప్రియాంక చోప్రా ట్విట్ట‌ర్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించింది. #AskPC ట్యాగ్‌తో ప్ర‌శ్న‌లు అడ‌గాల‌ని ఆమె కోరింది. దీంతో నెటిజ‌న్లు వివిధ ర‌కాల ప్ర‌శ్నలు సంధించారు. వాటిలో చాలా ప్ర‌శ్న‌ల‌కు ప్రియాంక స‌మాధాన‌మిచ్చింది.

`ప్రియాంక... గుడ్డు ప‌గ‌ల‌కుండా కింద ఎలా ప‌డేయాలో తెలుసా?` అని ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్నకు `వావ్‌... నాకు తెలుసుకోవాల‌ని ఉంది.. దాని వెన‌క ఏదైనా శాస్త్రీయ కార‌ణం ఉందా?` అని అడిగింది.

ఆమెకు నెటిజన్లు సంధించిన మరికొన్ని ప్రశ్నలు.. ప్రియాంక సమాధానాలు....

* పాప్ ఆల్బం కోసం ఎవ‌రితో చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తావ్‌?
రిహానాతో ప‌ని చేయాల‌నుకుంటున్నా
* న‌టి, మ్యుజీషియ‌న్ కాక‌పోయి ఉంటే ఏ రంగంలో ఉండే దానివి?
ఇంజినీర్‌.. నాకు 17 ఏళ్ల వ‌య‌సున్న‌పుడే ఇంజినీర్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నా.
* మీ అభిమానులు చేసిన పిచ్చి ప‌ని ఒక‌టి చెప్పండి?
నేను ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా నాతో పాటే ప్ర‌యాణించ‌డం
* ప్ర‌స్తుతం నీ జీవితంలో అతిపెద్ద ల‌క్ష్యం ఏది?
నా త‌ర్వాత అడుగును గ్ర‌హించుకోవ‌డం
* నువ్వు 9 గం.ల కంటే ఎక్కువసేపు ప‌డుకొని ఎంత‌కాల‌మైంది?
హ‌..హా... గ‌త వీకెండ్‌లో ప‌డుకున్నా

More Telugu News