పుస్తకాల మీద కూర్చుని ఫొటోలకు పోజులిచ్చిన ట్వింకిల్ ఖన్నా.. నెటిజన్ల విమర్శలు!
- పుస్తకాలను కాళ్లతో తొక్కుతోందని భ్రమ పడిన నెటిజన్లు
- ట్వింకిల్‌పై మండిపడుతూ కామెంట్లు
- గట్టిగా సమాధానం చెప్పిన నటి, రచయిత
దీనిపై స్పందించిన ట్వింకిల్... తాను పుస్తకాలపై కూర్చోలేదని, స్టూల్ మీద కాలు పెట్టానని, సరిగా చూడమని స్పష్టత ఇచ్చింది. అయితే నెటిజన్లు వెంటనే మాట మార్చి.... `పుస్తకాల మీద కూర్చోవడం కూడా తప్పే` అంటూ కామెంట్లు చేశారు. దానికి ఆమె.. `నాకు పుస్తకాల మీద కూర్చోవడానికి ఎలాంటి సంకోచం లేదు. అంతేకాదు... వాటి పక్కనే పడుకుంటా.. వీలైతే బాత్రూమ్‌కి కూడా తీసుకెళ్తా... పుస్తకాలను చదివినపుడే నీకు జ్ఞానం వస్తుంది, వాటిని గౌరవించినపుడు కాదు` అని గట్టిగా సమాధానం చెప్పి తన రచనా చాతుర్యాన్ని ప్రదర్శించింది. ఆమె ఇప్పటికే `మిసెస్ ఫన్నీ బోన్స్`, `ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీప్రసాద్` పేరుతో రెండు పుస్తకాలను రచించిన సంగతి తెలిసిందే.