tiger zinda hai: హాలీవుడ్ చిత్రాన్ని త‌ల‌పిస్తోన్న `టైగ‌ర్ జిందా హై` ఫ‌స్ట్‌ పోస్ట‌ర్‌

  • ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేసిన చిత్ర‌బృందం
  • యాక్ష‌న్ సినిమా అభిమానుల‌కు క‌నుల విందు
  • `ఏక్ థా టైగర్‌` చిత్రానికి కొన‌సాగింపుగా వ‌స్తున్న `టైగ‌ర్ జిందా హై`

సీక్రెట్ ఏజెంట్‌గా స‌ల్మాన్ న‌టించిన `ఏక్ థా టైగ‌ర్‌` చిత్రానికి కొన‌సాగింపుగా వ‌స్తున్న `టైగ‌ర్ జిందా హై` ఫ‌స్ట్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. పోస్టర్‌ను చూసిన వారంతా హాలీవుడ్ చిత్ర స్థాయిలో ఉంద‌ని పొగిడేస్తున్నారు. మెషీన్ గ‌న్ ప‌ట్టుకుని స‌ల్మాన్‌, రివాల్వ‌ర్ల‌తో క‌త్రినా కైఫ్‌, ఆ ప‌క్క‌నే కాలిపోయి కింద‌ప‌డుతున్న హెలికాప్ట‌ర్‌ను ఈ పోస్ట‌ర్‌లో చూడొచ్చు. `ఈ క్రిస్‌మ‌స్ కి, శాంతి చేకూరుతుంది` అనే క్యాప్ష‌న్‌తో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. య‌శ్‌రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌లో వ‌స్తున్న ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డిసెంబ‌ర్ 22న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

More Telugu News