rajnikanth: వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుద‌ల కానున్న ర‌జ‌నీకాంత్ `కాలా`

  • 2018లో ర‌జ‌నీ అభిమానుల‌కు పండ‌గ‌
  • విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ రోబో 2.0, కాలా
  • జ‌న‌వ‌రిలో విడుద‌ల‌కానున్న రోబో 2.0

వ‌చ్చే ఏడాది సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అభిమానుల‌కు పండగే పండ‌గ. నెల‌ల తేడాతో ఆయ‌న న‌టించిన రెండు సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. ఇప్ప‌టికే ఆ రెండు సినిమాల షూటింగ్ కూడా పూర్త‌వ‌డంతో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `రోబో 2.0` చిత్రం జ‌న‌వ‌రిలో విడుద‌ల‌కాబోతున్న సంగ‌తి తెలిసిందే.

అలాగే ర‌జ‌నీ మ‌రో చిత్రం `కాలా`ను కూడా ఏప్రిల్‌లో విడుద‌ల చేసేందుకు చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 12న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల విడుద‌ల వాయిదా ప‌డింది. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌నున్నట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ముంబైలో అణ‌చివేత‌కు గురైన త‌మిళుల జీవ‌నం నేప‌థ్యంలో `కాలా` చిత్రాన్ని పా రంజిత్ తెర‌కెక్కించారు. త‌మిళ - హిందీ భాష‌ల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రంలో నానా పటేక‌ర్‌, హ్యూమా ఖురేషీ, అంజ‌లి పాటిల్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

More Telugu News