ఎన్టీఆర్ బయోపిక్-3... వాణి విశ్వనాథ్ తో కలసి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సినిమా!

25-10-2017 Wed 10:05
  • ఇప్పటికే రెండు ఎన్టీఆర్ బయోపిక్ లు
  • ప్రకటించిన దర్శకులు వర్మ, తేజ
  • తాను కూడా ఉన్నానంటున్న కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
  • వాణి విశ్వనాథ్ తో కలసి సినిమా

ఎన్టీఆర్ బయోపిక్-3 సిద్ధమవుతోంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించగా, నందమూరి బాలకృష్ణ వెన్నుదన్నుగా, దర్శకుడు తేజ మరో చిత్రానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, తాను కూడా ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు ప్రకటించారు. తన చిత్రంలో సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని ఆయన చెప్పారు. కాగా, ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో వాణి విశ్వనాథ్ కూడా భాగస్వామ్యమైనట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.