usa: నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. రెండు కార్లు ధ్వంసం.. వీడియో చూడండి!

  • ఇంధనం అయిపోవడంతో కుప్పకూలిన విమానం
  • రెండు ఎస్యూవీ వాహనాలు ధ్వంసం
  • విమానం నుంచి కిందికి దూకేసిన పైలట్

నడిరోడ్డుపై ఓ మాదిరి విమానం ఒకటి కుప్పకూలిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ఇంధనం అయిపోవడాన్ని గమనించిన పైలట్ ఏటీసీని సంప్రదించారు. అనంతరం అకస్మాత్తుగా విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానాన్ని అదుపు చేసేందుకు పైలట్ ప్రయత్నించి, దానిని నడిరోడ్డుపై పడేలా చేశాడు.

ఈ క్రమంలో విమానం వేగంగా కిందికి దిగడంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న కార్లను తోసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని ఢీ కొట్టగానే విమానానికి మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానం నుంచి కిందికి దూకేశారు. ఈ ప్రమాదంలో రెండు ఎస్యూవీ వాహనాలు ధ్వంసం కాగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. 

More Telugu News