brides blue whale: ముంబై సముద్ర తీరంలో 40 అడుగుల తిమింగలం

  • ముంబైలోని కొలబాలోని నేవీ నగర్ ప్రాంత సముద్రతీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం
  • 40 అడుగుల పొడవున్న ఈ తిమింగలాన్ని బ్రైడ్స్ బ్లూ వేల్ గా గుర్తింపు
  • 50 అడుగుల వరకు పెరిగే బ్రైడ్స్ బ్లూ వేల్

భారీ తిమింగలాన్ని చూసి ముంబై వాసులు ఆశ్చర్యపోయారు. దక్షిణ ముంబైలోని కొలబాలోని నేవీ నగర్ ప్రాంత సముద్రతీరానికి భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. ఇది 40 అడుగుల పొడవు ఉంటుందని దానిని చూసిన స్థానికులు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చి, వారిని వెంటబెట్టుకుని వచ్చారు.

ఈ తిమింగలాన్ని బ్రైడ్స్‌ బ్లూ వేల్ రకానికి చెందినదిగా నిర్ధారించారు. ఈ రకానికి చెందిన తిమింగలాలు 50 అడుగుల వరకు పెరుగుతాయని తెలిపారు. అయితే ఇది ఎలా చనిపోయిందో తెలుసుకునేందుకు నమూనాలు తీసుకెళ్లారు. ఈ తిమింగలాలను 1972 వణ్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కాపాడుతున్నట్టు తెలిపారు. 

More Telugu News