Thammanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • హృతిక్ తో ఫొటో దిగిన తమన్నా
  • డిసెంబర్ నుంచి రవితేజ కొత్త సినిమా 
  • వచ్చే నెల 10న స్వాతి 'లండన్ బాబులు' 
  •  అసిన్ దంపతులకు పాప పుట్టింది

*  బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన కథానాయిక తమన్నా ఇటీవల హీరో హృతిక్ రోషన్ ను కలిసిందట. దీంతో ఆనందపడిపోతూ సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసింది. "హృతిక్ ను కలవడం అద్భుతంగా వుంది. మీ నుంచి ఎప్పుడూ స్ఫూర్తి పొందుతూనే వుంటాను. ఈ మధుర క్షణాలు ఎప్పుడూ పదిలమే" అంటూ ట్వీట్ చేసింది.
*  ఇటీవల రిలీజయిన 'రాజా ది గ్రేట్' చిత్రం సక్సెస్ హీరో రవితేజకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో ఆయన కొత్త సినిమాల ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తమిళ హిట్ చిత్రం 'భోగన్' రీమేక్ ను డిసెంబర్ నుంచి చేయనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  రక్షిత్, స్వాతి జంటగా దర్శకుడు మారుతి నిర్మించిన 'లండన్ బాబులు' చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. చిన్నికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 10న విడుదల చేయడానికి నిర్ణయించారు.
*  ప్రముఖ నటి అసిన్ తాజాగా నిజ జీవితంలో అమ్మ అయింది. ఈ ముద్దుగుమ్మ ఆమధ్య మైక్రో మ్యాక్స్ సీఈఓ రాహుల్ శర్మను వివాహమాడిన సంగతి విదితమే. తాజాగా ఈ దంపతులకు ఓ పాప పుట్టింది.    

More Telugu News