Woman Records Selfie Video: ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలుపుతూ.. సెల్ఫీ వీడియో తీసుకుని నిద్రమాత్రలు మింగిన వివాహిత!

  • హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి ఎస్ఏఆర్ అపార్ట్‌మెంట్‌లో ఘటన
  • మెయింటెనెన్స్ డబ్బు ఇవ్వాలంటూ అపార్ట్‌మెంట్ కార్యదర్శి వేధింపులు
  • సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటోలు 
  • బాధితురాలి పరిస్థితి విషమం

హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి ఎస్ఏఆర్ అపార్ట్‌మెంట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మెయింటెనెన్స్ డబ్బు ఇవ్వాలంటూ త‌మ అపార్ట్‌మెంట్ కార్యదర్శి సలీం తనను వేధిస్తున్నాడని తెలుపుతూ తబుస్సం అనే ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేసింది.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆమెను స‌లీం వేధిస్తోన్న విష‌యం నిజ‌మేన‌ని నిర్ధారించారు. నిందితుడు సలీం.. ఆ మ‌హిళ‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ మ‌హిళ సెల్ఫీ వీడియో ఆధారంగా ద‌ర్యాప్తు కొన‌సాగి‌స్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

More Telugu News