railway tracks: అమ్మాయిని ఒక్కసారిగా రైల్వే ట్రాక్‌మీదకు తోసేసి.. తనకు ఏమీ తెలియదన్నట్లు వెళ్లిపోయిన వ్యక్తి.. వీడియో ఇదిగో!

  • హాంకాంగ్‌లోని యూన్ లాంగ్‌లోని ఓ రైల్వే స్టేష‌న్‌లో ఘటన
  • దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్త‌ం
  • తన స్నేహితురాలితో యువతి మాట్లాడుతుండగా ఘటన
  • నిందితుడి అరెస్టు

రైల్వే స్టేష‌న్‌లో ఓ ప్లాట్‌ఫాంపై నిల‌బ‌డి త‌న స్నేహితురాలితో మాట్లాడుతోన్న ఓ యువ‌తిని ఓ వ్య‌క్తి రైల్వే ట్రాక్‌పైకి నెట్టేసి త‌న‌కు ఏమీ తెలియ‌ద‌న్న‌ట్లుగా మెల్లిగా న‌డుచుకుంటూ వెళ్లిపోయిన ఘ‌ట‌న హాంకాంగ్‌లోని యూన్ లాంగ్‌లోని ఓ రైల్వే స్టేష‌న్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్త‌మ‌య్యాయి. ఈ దృశ్యాల‌ను ఆ రైల్వే స్టేష‌న్ అధికారులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఓ యువ‌తి వ‌చ్చి ప్లాట్ ఫామ్ అంచున నిల‌బ‌డి మ‌రో యువ‌తితో మాట్లాడుతోంది. ఆ యువ‌తి వెన‌క నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తి ఆమెను వెన‌క‌నుండి ఒక్క‌సారిగా నెట్టేయ‌డంతో ఆమె అమాంతం వెళ్లి రైల్వే ట్రాక్‌పై ప‌డిపోయింది. ఆ స‌మ‌యంలో రైలు రాక‌పోవ‌డంతో ఆమె ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది.

ఆ యువ‌తికి తీవ్ర‌గాయాలు కావ‌డంతో ఆమెను రైల్వేస్టేష‌న్ సిబ్బంది ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. ఆమెను తోసేసిన వ్య‌క్తిని పోలీసులు వెంట‌నే అరెస్టు చేసి కేసు న‌మోదు చేసుకుని, నిందితుడు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ‌డానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తున్నారు.

More Telugu News