beard: గ‌డ్డం లేకుండా రానా ఎలా ఉన్నాడో చూశారా?... కొత్త‌లుక్ పోస్ట్ చేసిన రానా

  • `1945` పీరియాడిక‌ల్‌ చిత్రం కోసం కొత్త లుక్‌
  • న‌వంబ‌ర్‌లో ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల
  • ట్వీట్ చేసిన రానా

భ‌ల్లాల దేవుడు ద‌గ్గుబాటి రానా గ‌డ్డం లేకుండా ఉన్న ఫొటోలు చాలా అరుదుగా క‌నిపిస్తాయి. కానీ త‌న త‌ర్వాతి చిత్రం `1945` కోసం గ‌డ్డం లేని కొత్త గెట‌ప్‌లో క‌నిపించనున్నాడు. ఆ లుక్‌ని రానా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. `గ‌డ్డం పోయింది. షూటింగ్‌లో మ‌రో కాలానికి వెళ్తున్నాం. 1945 కోసం కొత్త‌లుక్ ప్ర‌య‌త్నిస్తున్నా. న‌వంబ‌ర్‌లో ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌వుతుంది` అని రానా ట్వీట్ చేశాడు.

రానా ఫోటో షేర్ చేసిన నిమిషాల్లోనే వేల‌ల్లో లైకులు వ‌చ్చాయి. `1945` చిత్రం ఒక పీరియాడిక‌ల్ డ్రామా. దేశ విభ‌జ‌న నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగ‌నుంది. ఇందులో కాలంతో పాటు రానా పాత్ర ఆహార్యం, గెట‌ప్ మారుతుంటాయి.

More Telugu News