driver: న‌డుస్తున్న బ‌స్సు స్టీరింగ్ వ‌దిలేసి, డ్యాన్సులు వేసిన డ్రైవ‌ర్‌... వీడియో చూడండి

  • ఇంట‌ర్నెట్‌లో న‌వ్వులు పూయిస్తున్న వీడియో
  • చివ‌రి దాక చూస్తేగానీ సంగ‌తి తెలియదు
  • బ‌స్సును లాక్కెళ్తున్న ట్ర‌క్‌

బ‌స్సు న‌డుపుతున్న డ్రైవ‌ర్ ఒక్క‌సారిగా సీట్లోంచి లేచి, స్పీక‌ర్‌లో వ‌స్తున్న పాట‌కు స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు జ‌ర‌గ‌బోయే ప్ర‌మాదం ఊహించుకోవ‌డానికే భ‌యంగా ఉంది క‌దా!... కొలంబియాలో అలాంటి ప‌నే చేసిన ఓ డ్రైవ‌ర్ వీడియో ఒక‌టి ఇంట‌ర్నెట్లో న‌వ్వులు పూయిస్తోంది.

ప్ర‌మాదం జ‌రిగే సంద‌ర్భంలో ఎవ‌రైనా న‌వ్వుతారా? అని ఆశ్చ‌ర్య‌పోకండి. వీడియో చివ‌రి వ‌ర‌కు చూస్తే ఎవ‌రైనా న‌వ్వాల్సిందే! నిజానికి ఆ బ‌స్సు పాడైంది. దాన్ని వెన‌కాల త‌గిలించుకుని ఓ ట్ర‌క్కు లాక్కెళ్తోంది. ఈ విష‌యాన్ని వీడియో చివ‌ర్లో చూపించారు. దీంతో అప్ప‌టి వ‌రకు ఏం ప్ర‌మాదం జ‌రుగుతుందో అని ఆందోళ‌న చెందిన వారంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నారు.

More Telugu News