kareena kapoor khan: బాబు పుట్టాక క‌రీనా క‌పూర్ నటించిన మొద‌టి సినిమా `వీరే ది వెడ్డింగ్‌` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

  • క‌రీనాలో ఎలాంటి మార్పు లేదంటున్న నెటిజ‌న్లు
  • ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్‌లుక్‌
  • ప్ర‌ధాన పాత్రల్లో సోన‌మ్ క‌పూర్‌, స్వ‌రా భాస్క‌ర్‌

తైమూర్ అలీ ఖాన్‌కి జ‌న్మనిచ్చాక క‌రీనా క‌పూర్ ఖాన్‌ న‌టిస్తున్న మొద‌టి చిత్రం `వీరే ది వెడ్డింగ్‌` సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. ప‌సుపు, బంగారు వ‌ర్ణ దుస్తులు ధ‌రించి, ముఖాలు స‌గం స‌గం చూపిస్తున్న ఈ ఫ‌స్ట్‌లుక్ అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. క‌రీనాలో అందం, ఫిట్‌నెస్‌ ప‌రంగా ఎలాంటి మార్పు క‌నిపించ‌డం లేద‌ని నెటిజ‌న్లు పొగిడేస్తున్నారు. శ‌శాంక ఘోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో క‌రీనా క‌పూర్‌తో పాటు సోన‌మ్ క‌పూర్‌, స్వ‌రా భాస్క‌ర్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన మొద‌టి షెడ్యూల్ షూటింగ్ ఇటీవ‌లే ఢిల్లీలో  పూర్త‌యింది.

More Telugu News