సీఎం చంద్రబాబు: సీఎం చంద్రబాబు యువకుడిలాగానే కనపడుతున్నారు: నారా లోకేశ్

  • ప్ర‌కాశం జిల్లాలో లోకేశ్ పర్యటన
  • 2019 నాటికి ఇంటింటికీ న‌ల్లా ద్వారా మంచినీరు
  • 2019 నాటికి ప్ర‌తి గ్రామంలో డంపింగ్ యార్డుల నిర్మాణం
  • రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్నారు

ప్ర‌కాశం జిల్లాలో తాగునీటి స‌మ‌స్య ఎక్కువ‌గా ఉందని, దాన్ని ప‌రిష్క‌రిస్తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ రోజు ప్ర‌కాశం జిల్లాలో ప‌ర్య‌టిస్తోన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా ఓ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ... 2019 నాటికి ఇంటింటికీ న‌ల్లా ద్వారా మంచినీరు అందిస్తామ‌ని చెప్పారు. అలాగే 2019 నాటికి ప్ర‌తి గ్రామంలో డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేస్తామ‌ని తెలిపారు. 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో భూగ‌ర్భ డ్రైనేజీలు నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చారు. 67 ఏళ్ల వ‌యసులోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, త‌న తండ్రి నారా చంద్ర‌బాబు నాయుడు యువ‌కుడిలాగానే క‌న‌ప‌డుతున్నార‌ని లోకేశ్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్నార‌ని లోకేశ్ అన్నారు. ప్ర‌తి కుటుంబానికి నెల‌కు రూ.10 వేల ఆదాయం క‌చ్చితంగా రావాల‌న్నదే చంద్ర‌బాబు ధ్యేయ‌మ‌ని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు 9 రోజుల్లోనే 3 దేశాలు తిరిగారని చెప్పారు. 

More Telugu News