sunil: మాట నిలబెట్టుకున్న త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ మూవీలో సునీల్ కి ఛాన్స్?

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలైన ఎన్టీఆర్ తాజా చిత్రం 
  • ఓ ముఖ్యమైన పాత్ర కోసం నారా రోహిత్ ను అనుకున్నారనే టాక్ 
  • ఆ ప్లేస్ లో సునీల్ ను తీసుకున్నారనే ప్రచారం 
  • సునీల్ ను ఆదుకోవడం కోసం త్రివిక్రమ్ తీసుకున్న నిర్ణయం  

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తాజా చిత్రం పవన్ చేతుల మీదుగా మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన ఒక విషయం ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకి గాను నారా రోహిత్ ను అనుకున్నారట. అయితే ఇప్పుడు ఆ పాత్రను సునీల్ కి ఇచ్చినట్టుగా టాక్. ఈ విషయంలో ఎన్టీఆర్ ను కూడా త్రివిక్రమ్ ఒప్పించాడని అంటున్నారు.

 కమెడియన్ గా సునీల్ టాప్ పొజిషన్ కి వెళ్లడం వెనుక త్రివిక్రమ్ హస్తం వుంది. అయితే ఈ మధ్య హీరోగా సునీల్ పొజీషన్ అంత బాగా లేదు. దాంతో ఆయన తిరిగి కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. అది త్రివిక్రమ్ మూవీ అయితే మరింత బాగా ఉంటుందని ఆయన భావించాడట. ఈ విషయంలో ఆయనకి త్రివిక్రమ్ మాట ఇచ్చాడు. ఆ మాటకు కట్టుబడే సునీల్ కి ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు.  

More Telugu News