taj mahal: తాజ్ మహల్ వద్ద శివుడి పూజ చేసిన యువకులు.. ఉద్రిక్తత!

  • శివుడుని కీర్తిస్తూ పాటలు
  • తాజ్ కింద ఉన్నది శివాలయమే అంటూ వాదన
  • అరెస్ట్, విడుదల

ప్రఖ్యాత పర్యాటక స్థలం తాజ్ మహల్ వద్ద కొంత మంది యువకులు శివుడి పూజను నిర్వహించారు. శివుడిని కీర్తిస్తూ పాటలు పాడారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా అలజడి చెలరేగింది. షాక్ కు గురైన సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది... ఇక్కడ పూజలు చేయవద్దంటూ వారిని వారించారు. దీంతో, వారిపై యువకులు తిరగబడ్డారు. పూజ మధ్యలో ఉన్న తమను లేపే ప్రయత్నం చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమాజ్ చేసేవారిని మీరు ఏమీ అనడం లేదు... మేము పూజ చేస్తే మాత్రం తప్పా? అని ఎదురు ప్రశ్నించారు. తాజ్ మహల్ కింద ఉన్నది శివాలయమే అని వాదించారు.

దీపక్ శర్మ అనే వ్యక్తి నేతృత్వంలో కొందరు యువకులు టూరిస్టుల మాదిరి తాజ్ సందర్శనకు వచ్చారు. లోపలకు వచ్చిన తర్వాత కింద కూర్చొని శివుడి పారాయణం మొదలుపెట్టారు. వీరందరినీ రాష్ట్రీయ స్వాభిమాన్, హిందూ యువవాహిని కార్యకర్తలుగా గుర్తించారు. అనంతరం వీరిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. అయితే, యువకులు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి క్షమాపణ చెప్పడంతో, వారిని వదిలిపెట్టారు.

More Telugu News