హైదరాబాద్ మెట్రో : హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు ... సాధారణ ప్రజలు కూడా ఉపయోగించుకునేట్లు 40 టాయిలెట్స్ ఏర్పాటు!

  • వచ్చేనెల మూడో వారంలో ప్రారంభం కానున్న మెట్రో రైల్
  • ప్ర‌యాణికులకే కాకుండా న‌గరవాసుల‌కు కూడా పలు సేవ‌లు
  • నాగోల్ నుంచి మియాపూర్ వ‌ర‌కు మొత్తం 20 మెట్రో స్టేషన్లు
  • ఒక్కో స్టేష‌న్‌కి రెండు బాత్రూంల చొప్పున మొత్తం 40 టాయిలెట్స్

హైద‌రాబాదీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెట్రో రైల్ వచ్చేనెల మూడో వారంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థ‌మే కాకుండా న‌గరవాసుల‌కు కూడా సేవ‌లు అందించేందుకు మెట్రో ఎన్నో ఏర్పాట్లు చేస్తోంది. మెట్రో రైల్ వెళ్ల‌నున్న అన్ని దారుల్లో ఇప్ప‌టికే మెట్రో సిబ్బంది పెద్ద ఎత్తున మొక్క‌లు నాటి స‌ర్వాంగ‌సుంద‌రంగా తీర్చిదిద్దారు. మెట్రో ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఉపయోగించుకునే మూత్రశాలలను ఏర్పాటు చేసినట్లు మెట్రో అధికారులు ఈ రోజు మీడియాకు తెలిపారు.

మొద‌టి ద‌శ మెట్రో రైల్ ప్రారంభం కానున్న‌ నాగోల్ నుంచి మియాపూర్ వ‌ర‌కు మొత్తం 20 స్టేషన్లు ఉన్నాయి. అందులో ఒక్కో స్టేష‌న్‌కి రెండు బాత్రూంల చొప్పున మొత్తం 40 టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఒక మూత్రశాల రోడ్డుపై ఉండ‌గా, మరొకటి స్టేషన్‌లో నిర్మించారు. అంతేకాదు వీటిని ఉప‌యోగించుకోవాలంటే నామమాత్రపు రుసుమును మాత్ర‌మే వసూలు చేయనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.

More Telugu News