prabhas: 'సాహో' ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా కాపీయేనట... కనిపెట్టేసిన నెటిజన్లు... చూడండి!

  • 'బ్రేడ్ రన్నర్ 2049'ను పోలిన ప్రచార చిత్రం
  • ర్యాన్ గ్లోసింగ్ ఫోజులో కనిపిస్తున్న ప్రభాస్
  • రెండు ఫొటోలూ పక్కపక్కనే పెట్టి షేర్ చేస్తున్న నెటిజన్లు

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం 'సాహో' ఫస్ట్ లుక్ రెండు రోజుల క్రితం విడుదలై వైరల్ అయిన సంగతి తెలిసిందే ప్రభాస్ 38వ పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్ విడుదల కాగా, ఇది 'బ్లేడ్ రన్నర్ 2049' పోస్టర్ కు కాపీ అని నెటిజన్లు తేల్చేశారు. 'సాహో' పోస్టర్ లో ప్రభాస్ ఫుల్ లెన్త్ జాకెట్ ధరించి, ముఖానికి మాస్క్ కట్టుకుని నడుస్తున్నట్టు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పోజ్ 'బ్రేడ్ రన్నర్' సిరీస్ చిత్రాల్లో ర్యాన్ గోస్లింగ్, హారిసన్ ఫోర్డ్ ల పోజేనని చెబుతూ రెండు చిత్రాలనూ పోల్చుతూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఆ చిత్రాలను మీరూ చూడవచ్చు.

More Telugu News