pressure: ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందించిన ప్రధాన ఎన్నికల కమిషనర్

  • తమపై ప్రభుత్వ ఒత్తిడి ఉందన్న వార్తలను ఖండించిన సీఈసీ
  • ఏ పార్టీని ప్రత్యేకంగా పరిగణించబోమని వ్యాఖ్య
  • ఎన్నికల కోడ్ అమల్లోకి రాకుండా ఏమీ చేయలేమన్న అచల్ కుమార్

ఎన్నికల సంఘంపై ఎన్డీయే ప్రభుత్వ ఒత్తిడి పూర్తిస్థాయిలో పనిచేస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జోటి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాము ఏ పార్టీని ప్రత్యేకంగా పరిగణించబోమన్నారు. అన్ని పార్టీలను సమదృష్టితో చూస్తామన్నారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే విషయంలో ఏ పార్టీకి, ఎటువంటి డైరెక్షన్ ఇవ్వబోమన్నారు. గుజరాత్‌తో మొన్న మోదీ పర్యటించారని, నిన్న రాహుల్ గాంధీ పర్యటించారని గుర్తు చేశారు.

త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌తో పర్యటించిన మోదీ పలు అభివృద్ది పథకాలకు శంకుస్థాపన చేయడం, ప్రజలకు హామీలు ఇవ్వడంపై ఈసీ ఎందుకు మౌనం దాల్చిందన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు హామీలు ఇవ్వడం అన్ని పార్టీలు చేస్తుంటాయని, ఎన్నికల కోడ్ అమల్లోకి రానంత వరకు తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పారు. తమపై ప్రభుత్వ ఒత్తిడి ఎంతమాత్రమూ లేదన్నారు.

More Telugu News