brazil: ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని 245 మంది వంతెనపై నుంచి ఒకేసారి దూకితే... వీడియో చూడండి!

  • బ్రెజిల్ లో రికార్డు కోసం ప్రయత్నం
  • రోప్ జంప్ చేసి విన్యాసాలు
  • వైరల్ అవుతున్న వీడియో

బ్రెజిల్ లో ఓ రికార్డు కోసం 245 మంది స్త్రీ, పురుషులు ఒకరి చెయ్యిని ఒకరు పట్టుకుని 30 మీటర్లు (సుమారు 100 అడుగులు) ఎత్తున్న వంతెనపై నుంచి ఒకేసారి కిందకు దూకి విన్యాసాలు చేశారు. గతంలో ఓ వంతెనపై నుంచి ఒకేసారి దూకిన వారి సంఖ్య 149 కాగా, ఆ రికార్డును వీరు బద్దలు కొట్టారు. శావ్ పావ్ లోకు సమీపంలో ఉండే హోర్టోలాండియా సమీపంలోని ఓ బ్రిడ్జిపై నుంచి తాళ్లు కట్టుకుని రోప్ జంపింగ్ చేసిన వీరు, ఉయ్యాల మాదిరి ఊగుతూ విన్యాసాలు చేశారు.

కాగా, ఈ విన్యాసం చాలా క్లిష్టతరమైంది. సాధారణ బంగీ జంప్ తో పోలిస్తే కట్టుకున్న తాడు వెనక్కు బౌన్స్ కాదు. వీరంతా నైలాన్ తాళ్లు కట్టుకుని ఈ ఫీట్ చేశారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచగా, అదిప్పుడు వైరల్ అయింది. వీరి రికార్డు ప్రయత్నాన్ని మీరూ చూడవచ్చు.

More Telugu News