allari naresh: హిట్ కోసం అల్లరి నరేశ్ ప్రయత్నాలు .. 'సుడిగాడు' దర్శకుడితో మరో సినిమా!

  • సక్సెస్ కోసం అల్లరి నరేశ్ ఎదురుచూపులు 
  • గతంలో హిట్ ఇచ్చిన దర్శకులకు ఛాన్స్ 
  • ఆల్రెడీ సత్తిబాబు దర్శకత్వంలో ఒక సినిమా 
  • తాజాగా భీమనేని శ్రీనివాసరావుకి ఓకే          

అల్లరి నరేశ్ సినిమాలు ఆద్యంతం హాస్యంతో కొనసాగుతూ ఉంటాయి. అందువలన ఆయన సినిమాలను అన్నివర్గాల ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. అయితే కొంతకాలంగా ఆయన సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో తదుపరి సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడు.

 ఈ క్రమంలో ఇటీవలే దర్శకుడు సత్తిబాబుతో ఒక సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'బెట్టింగ్ బంగార్రాజు' .. 'యముడికి మొగుడు' వచ్చాయి. ఇక దర్శకుడు భీమనేని శ్రీనివాసరావుతోను ఒక సినిమాను చేయడానికి ఓకే చెప్పాడనేది తాజా సమాచారం. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన 'సుడిగాడు' ఏ స్థాయి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. త్వరలోనే వీళ్లు సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.             

More Telugu News