జగన్: సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానంలో జగన్ కు చుక్కెదురు!

  • అక్రమాస్తుల కేసులో ప్ర‌తి శుక్ర‌వారం విచారణకు హాజరవుతోన్న జ‌గ‌న్
  • పాదయాత్ర నేపథ్యంలో మినహాయింపు ఇవ్వాలని పిటిషన్
  • జ‌గ‌న్ అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించిన కోర్టు

హైద‌రాబాద్‌లోని సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో ప్ర‌తి శుక్ర‌వారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విచార‌ణ‌కు హాజ‌రు అవుతోన్న విష‌యం తెలిసిందే. అయితే, తాను వ‌చ్చేనెల 2 నుంచి పాద‌యాత్ర చేయ‌నున్న నేప‌థ్యంలో ఆరు నెల‌ల పాటు వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని జ‌గ‌న్ వేసిన పిటిష‌న్‌పై కోర్టు ఈ రోజు త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. జ‌గ‌న్ అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు కోర్టు పేర్కొంది. అయితే, జగన్ హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. 

More Telugu News