maheshbabu: మహేశ్ 25వ సినిమా కోసం పరిశీలనలో రెండు ఇంట్రెస్టింగ్ టైటిల్స్

  • 'భరత్ అను నేను' షూటింగులో బిజీగా మహేశ్ బాబు 
  • ఆ తరువాత మూవీ వంశీ పైడిపల్లితో
  • ఇది మహేశ్ కి 25వ సినిమా 
  • చురుకుగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు

ప్రస్తుతం మహేశ్ బాబు .. కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా చేస్తున్నాడు. మహేశ్ బాబు కెరియర్లో ఇది 24వ సినిమా. ఇందులో ఆయన ముఖ్యమంత్రిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత మహేశ్ బాబు .. తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.

ఈ సినిమా టైటిల్ విషయంలో మహేశ్ అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా వున్నారు. ఈ సినిమా కోసం రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఒక టైటిల్ 'కృష్ణా ముకుందా మురారి' అయితే, 'హరేరామ హరే కృష్ణ' అనేది మరో టైటిల్. ఈ రెండింటిలో 'కృష్ణా ముకుందా మురారి' టైటిల్ వైపు మొగ్గుచూపే అవకాశాలు వున్నట్టుగా చెబుతున్నారు. గతంలో 'బృందావనం' వంటి యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అందించిన వంశీ పైడిపల్లి, ఈ సారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే మహేశ్ తో కలిసి రంగంలోకి దిగుతున్నాడనేది ఇండస్ట్రీ టాక్.      

More Telugu News