shinjo abe: జపాన్ ఎన్నికల్లో షింజో అబే ఘన విజయం!

  • మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించిన షింజో అబే
  • 465 స్థానాల్లో 312 చోట్ల లిబరల్ డెమొక్రటిక్ కూటమి విజయం
  • అభినందనలు తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

జపాన్ సార్వత్రిక ఎన్నికల్లో షింజో అబే నేతృత్వంలోని పాలక కూటమి ఘన విజయం సాధించింది. దిగువ సభలో ఈ కూటమికి మూడింట రెండు వంతులకు పైగా మెజారిటీ దక్కింది. మొత్తం 465 మంది సభ్యులు ఉన్న జపాన్‌ పార్లమెంట్‌ దిగువ సభలో ప్రస్తుతం అధికారంలో ఉన్న షింజో అబే నేతృత్వంలోని లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ కూటమికి 312 స్థానాలు లభించాయి.

ఉత్తర కొరియాతో నానాటికీ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో సైనిక చర్యలు సహా, కీలకమైన అడుగులు వేయాలని భావించిన షింజో అబే, తనకున్న ప్రజల మద్దతును మరోసారి చూపేందుకు, గత నెలలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, అబే గెలుపొందడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడేందుకు షింజో అబే గెలుపు ఉపకరిస్తుందని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఘన విజయాన్ని సాధించిన స్నేహితుడు షింజో అబేకు శుభాకాంక్షలని అన్నారు.

More Telugu News