raviteja: 'రాజా ది గ్రేట్' నాలుగు రోజుల వసూళ్లు!

  • అదే దూకుడు చూపుతోన్న 'రాజా ది గ్రేట్'
  • తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్ల గ్రాస్
  • ప్రపంచవ్యాప్తంగా 31 కోట్ల గ్రాస్ 
  • ఒక్క నైజామ్ లోనే 6.55 కోట్ల షేర్

దీపావళి కానుకగా 'రాజా ది గ్రేట్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంధుడిగా రవితేజ నటించిన ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడిగా అనిల్ రావిపూడి ఇంతకుముందు హిట్స్ ఇవ్వడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో తొలి నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 24 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. డిస్ట్రిబ్యూటర్ షేర్ గా 15.73 కోట్లను రాబట్టింది.

 ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా 6.55 కోట్ల షేర్ ను సాధించడం గొప్ప విషయమేనని అంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లో 31 కోట్ల గ్రాస్ ను సాధించగా, 20 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ ను రాబట్టింది. దర్శకుడిగా అనిల్ రావిపూడికి .. కథానాయికగా మెహ్రీన్ కి ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ ఇవ్వడం విశేషంగా చెప్పుకుంటున్నారు.      

More Telugu News