liouor: మందేస్తే మంచిగా మాట్లాడేయొచ్చట... కొత్త భాషలు కూడా సులభంగా వస్తాయంటున్న తాజా అధ్యయనం!

  • రెండు విశ్వవిద్యాలయాలు, ఓ కాలేజ్ సంయుక్త అధ్యయనం
  • 50 మంది జర్మన్లపై డచ్ భాష పరీక్ష
  • మద్యం తాగితే డచ్ లో మంచిగా మాట్లాడిన జర్మన్లు

ఓ మోస్తరుగా మద్యం తాగే వాళ్లల్లో కొత్త భాషలు మాట్లాడే సామర్థ్యం మెరుగుపడుతుందని నూతన అధ్యయనం ఒకటి వెల్లడించింది.  నెదర్లాండ్స్ లోని మాస్ట్రిచ్‌ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ లివర్‌ పూర్, లండన్‌ కేంద్రంగా నడుస్తున్న కింగ్స్‌ కాలేజ్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేసి ఫలితాలను వెల్లడించారు.

 వీరి పరిశోధనలో భాగంగా, తాజాగా, డచ్‌ నేర్చుకున్న 50 మంది జర్మన్లను ఎంపిక చేసి, వారి శరీరాకృతి, బరువును బట్టి తాగాల్సిన మద్యం డోస్‌ ను నిర్ణయించారు. వీరి భాషా ప్రావీణ్యాన్ని గుర్తించేందుకు ఇద్దరు డచ్‌ పౌరుల్ని నియమించారు. వీరంతా మద్యం తాగి ఉంటారని డచ్ పరిశీలకులకు ఎంతమాత్రం తెలియనీయలేదు. ఇక మద్యం తాగని వారితో పోల్చుకుంటే, పరిమితంగా మద్యం తాగే వాళ్లు భాషను మాట్లాటడంలో ఎంతో మెరుగ్గా వ్యవహరిస్తున్నట్టు తేలింది. ఈ అధ్యయన ఫలితాలను శాస్త్రవేత్తలు విడుదల చేశారు.

More Telugu News