ys jagan: నరాలు తెగే టెన్షన్... నేటి కోర్టు తీర్పుపై వైసీపీ నేతల్లో ఎడతెగని ఉత్కంఠ!

  • ఆరు నెలల పాటు సాగనున్న పాదయాత్ర
  • వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన జగన్
  • వాదనలు పూర్తి - నేడు తీర్పు
  • ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వైకాపా శ్రేణులు

ఆరు నెలల ప్రయాణం... 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర. ఆంధ్రప్రదేశ్ అంతటినీ చుట్టి రావాలన్న ఆకాంక్ష. ప్రజా సమస్యలు తెలుసుకోవాలన్న కోరిక. జగన్ బయలుదేరితే పార్టీ స్వరూపమే మారిపోతుందని, ప్రజల్లోకి మరింతగా చొచ్చుకెళ్లి అధికారానికి దగ్గర కావచ్చని వైకాపా నేతలు గంపెడాశతో ఉన్నారు. రాష్ట్రమంతటినీ పాదయాత్ర ద్వారా చుట్టి రావాలని, తద్వారా పార్టీని మరింతగా బలోపేతం చేయాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ తీసుకున్న కీలక నిర్ణయం అమలు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై ఆధారపడి వుంది.

  తాను ఆరు నెలల పాటు పాదయాత్ర తలపెట్టానని, అందువల్ల ప్రతి వారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాలేనని, మినహాయింపు ఇవ్వాలని కోరుతూ, వైఎస్ జగన్ వేసిన పిటిషన్ పై వాదనలు ముగియగా, నేడు తీర్పు వెలువడనుంది. దీని కోసం వైకాపా శ్రేణులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.
 

More Telugu News