Snake shyam: మామూలోడు కాదు.. 'పాము'లోడు.. రికార్డు కొట్టిన 'స్నేక్' శ్యాం!

  • పాములు పట్టడంలో రికార్డులు సృష్టిస్తున్న కార్పొరేటర్
  • స్నేక్ శ్యాంగా గుర్తింపు..
  • వృత్తిని కొనసాగిస్తానంటున్న శ్యాం

పాము కనిపించిందన్న వార్త వినిపిస్తే చాలు ఠక్కున వచ్చి అక్కడ వాలిపోతాడు. దానిని చాకచక్యంగా పట్టుకుని సంచిలో వేసుకుని వెళ్లిపోతాడు. విషపు నాగు అయినా సరే అతడిని చూస్తే సైలెంట్ అయిపోతుంది. అలా  ఆయన ఇప్పటి వరకు 33 వేల పాములు పట్టి రికార్డు సృష్టించాడు. పాములు పడుతున్నాడు కదా అని ఆయనేమీ సాదాసీదా వ్యక్తి కాదు, మైసూరు కార్పొరేటర్!

అతని పేరు శ్యాం. కానీ పాములు పట్టడంలో ప్రత్యేకత కనబరుస్తున్న ఆయన పేరు ముందు స్నేక్ చేరి ‘స్నేక్ శ్యాం’గా మారిపోయింది. కార్పొరేటర్‌గా ఉంటూనే పాములు పడుతూ వృత్తి, ప్రవృత్తి రెండింటికీ సమన్యాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 33 వేల పాముల్ని పట్టి రికార్డు సృష్టించాడు. తాజాగా మైసూరులో జయబాయి అనే మహిళ వంట గదిలో నక్కిన నాగుపామును పట్టుకోవడంతో ఈ రికార్డు అతని సొంతమైంది. 1977 నుంచి పాములు పడుతున్న తాను ఇకపైనా దీనిని కొనసాగిస్తానని శ్యాం పేర్కొన్నాడు.

More Telugu News