Chandrababu: నవ్యాంధ్రలో ఏరో సిటీ.. ముందుకొచ్చిన యూఏఈ సంస్థ!

  • ఫలిస్తున్న చంద్రబాబు ప్రయత్నాలు
  • రూ.35,798 కోట్లతో ఏరో సిటీ నిర్మాణం
  • ప్రత్యక్షంగా 15 వేల మందికి ఉపాధి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి బృందం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. నవ్యాంధ్రలో ఏరో సిటీ ఏర్పాటుకు ఆ దేశానికి చెందిన ఏవియేషన్ సిటీ ఎల్ఎల్‌పీ సంస్థ ముందుకొచ్చింది. మొత్తం రూ.35,798 కోట్లతో దశల వారీగా ఏరో సిటీ నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ ఈడీబీ-ఏవియేషన్ సిటీ ఎల్ఎల్‌పీ మధ్య అవగాహన కుదిరింది. దీనివల్ల ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా మరో ఐదు వేల మందికి ఉపాధి లభించనుంది.

ఏరో  సిటీ ఏర్పాటుకు పదివేల ఎకరాలు అవసరం కాగా  దీనిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై అధ్యయనం కోసం నవంబరు మూడో వారంలో ఎల్ఎల్‌పీ సంస్థ ప్రతినిధులు రాష్ట్రానికి వస్తారు. జనవరి మొదటి వారంలో నివేదిక అందజేస్తారు.

More Telugu News