లక్ష్మీపార్వతి: నా మొదటి పెళ్లి నా ఇష్టం లేకుండానే జరిగింది!: లక్ష్మీపార్వతి

  • అనుకోని పరిస్థితుల్లో నా మొదటి పెళ్లి జరిగింది
  • మా అమ్మానాన్నలకు కూడా ఆ పెళ్లి ఇష్టం లేదు
  • నాటి విషయాలను ప్రస్తావించిన లక్ష్మీపార్వతి

గతంలో తన మొదటి పెళ్లి గురించి లక్ష్మీపార్వతి ప్రస్తావించారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నేను ఎన్టీఆర్ జీవితంలోకి రావడంపై చాలా విమర్శలు వచ్చాయి. అలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఏ మనిషినీ పూర్తిగా మంచి అని కానీ, లేదా చెడు అని గానీ అనం.. ఇది సహజమే’ అన్నారు.

‘మీ మొదటి భర్త మిమ్మల్ని బాగా చూసేవారని అంటుంటారు. ఎంతవరకు వాస్తవం?’ అనే ప్రశ్నకు లక్ష్మీపార్వతి సమాధానమిస్తూ, ‘నిజం చెప్పాలంటే, నా మొదటి పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది. అనుకోని పరిస్థితుల్లో అయిన పెళ్లి అది. మా అమ్మానాన్నలు కూడా ఆ పెళ్లిని తిరస్కరించారు. మాకు ఒక కొడుకు పుట్టిన తర్వాత, నా భర్త, నేను దూరమయ్యాం. విభేదాల కారణంగా మేము విడిపోయాం. ఆ తర్వాత, నేను ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయా’ అని నాటి విషయాలను ఆమె ప్రస్తావించారు.

More Telugu News