assam: ఆక‌ట్టుకుంటున్న అసోం టూరిజం వీడియో... మీరూ చూడండి

  • బ్రాండ్ అంబాసిడ‌ర్‌ ప్రియాంక చోప్రా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌
  • అసోం సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించిన ప్రియాంక‌
  • అసోంలోని సంద‌ర్శ‌క ప్ర‌దేశాల అద్భుత ఆవిష్క‌ర‌ణ‌

త‌మ రాష్ట్ర ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌చారం క‌ల్పించేందుకు అసోం టూరిజం శాఖ విడుద‌ల చేసిన వీడియో నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటోంది. `ఆస‌మ్ అసోం` పేరుతో విడుద‌ల చేసిన ఈ వీడియోలో అసోం మ‌హిళ‌లు ధ‌రించే సంప్ర‌దాయ దుస్తులైన మేఖేల చ‌దోర్ వేసుకుని, భిహు నృత్యం స్టెప్పులు వేస్తున్న ప్రియాంక చోప్రాను చూడొచ్చు. అలాగే నేప‌థ్యంలో చ‌క్కని మెలోడీ సంగీతంతో అసోం సంస్కృతిని, సంప్ర‌దాయాల‌ను, నృత్యాల‌ను, ప‌ర్యాటక ప్ర‌దేశాల‌ను, జాతుల‌ను, పండ‌గ‌ల‌ను ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు. ఒక్క‌సారి అసోం వెళ్తే అక్క‌డి అనుభ‌వాలు మ‌ర్చిపోలేర‌నే అంశంతో ఈ వీడియోను చిత్రీక‌రించారు.

More Telugu News