sj surya: 'మెర్సెల్' 3వ రోజునే 100 కోట్లు .. 150 కోట్లను సాధించే ఛాన్స్?

  • 120 కోట్ల బడ్జెట్ తో రూపొందిన 'మెర్సెల్' 
  • అత్యధిక థియేటర్స్ లో విడుదల 
  • ఒక రేంజ్ లో వసూళ్లు 
  • కొత్త రికార్డులు నమోదు  

విజయ్ తాజా చిత్రం 'మెర్సెల్' పై విడుదలకి ముందునుంచే భారీ అంచనాలు వున్నాయి. ఇక విడుదలైన రోజు నుంచి వసూళ్ల పరంగా ఈ సినిమా దుమ్ము రేపేస్తోంది. దేశవ్యాప్తంగా 4500 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, తొలి రోజున 43.3 కోట్లను వసూలు చేసింది. ఇక రెండవ రోజున 70 కోట్లను రాబట్టింది. ఇక 3వ రోజైన శనివారంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

వసూళ్ల పరంగా ఇప్పటికే 'కబాలి' .. ' వివేగం' రికార్డులను ఈ సినిమా అధిగమించిందని అంటున్నారు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఇలాగే వసూళ్ల జోరు కొనసాగితే, ఈ సినిమా 150 కోట్ల మార్క్ ను చేరుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 120 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో విజయ్ మూడు పాత్రలను పోషించగా, కాజల్ .. సమంతా .. నిత్యామీనన్ కథానాయికలుగా నటించారు.    

More Telugu News