david warner: నేను రోహిత్ ను ఇంగ్లిష్ లో మాట్లాడమని చెప్పా...జాత్యహంకార వ్యాఖ్యలు చేయలేదు: వార్నర్ వివరణ

  • యాషెస్ యుద్ధంతో సమానం, ఇంగ్లండ్ పై ద్వేషమే తమను ఈ సిరీస్ లో ముందుకు నడిపిస్తుందన్న వార్నర్
  • వార్నర్ పై మండిపడుతున్న సీనియర్లు
  •  విచారణకు సిద్ధమంటూ వివరణ ఇచ్చిన వార్నర్

యాషెస్‌ సీరీస్ తమకు యుద్ధంతో సమానమని, ఇంగ్లండ్ పై ద్వేషమే ఈ సిరీస్ లో తమను ముందుకు నడిపిస్తుందని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేర్కొన్న వ్యాఖ్యలు వివాదం రేపిన సంగతి తెలిసిందే. 'ఇంగ్లండ్‌ పై అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా? వార్నర్ సంయమనం పాటించాలి' అంటూ పలువురు క్రికెటర్లు ఖండించారు.

ఈ నేపథ్యంలో గతంలో రోహిత్ శర్మపై కూడా వార్నర్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2014-15 ఆసీస్ పర్యటన సందర్భంగా మెల్ బోర్న్ స్టేడియంలో చోటుచేసుకున్న సంఘటన గురించి చెబుతూ, ఆ రోజు రన్ కోసం ప్రయత్నించిన రోహిత్ ను ఆపేందుకు విసిరిన బంతి అతనికి బాగా దగ్గరగా వెళ్లిందని, దీంతో పరుగు తీసిన అనంతరం రోహిత్ హిందీలో ఆగ్రహం వ్యక్తం చేశాడని అన్నాడు.

దానికి తాను ఇంగ్లిష్ లో చెప్పు అని అడిగానని, కావాలంటే ఆ రోజు మ్యాచ్ వీడియో పుటేజ్ ను పరిశీలించుకోవాలని సూచించాడు. తనకు హిందీ రాని కారణంగా రోహిత్ ఏమన్నాడో అర్ధం కాలేదని, దాంతోనే రోహిత్ ను ఇంగ్లిష్ లో మాట్లాడమని కోరానని చెప్పాడు. అయితే దానిని మీడియాలో జాత్యహంకార వ్యాఖ్యలుగా పేర్కొంటూ కథనాలు వెలువడ్డాయని చెప్పాడు.

దానిపై ఎలాంటి విచారణను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. కాగా, ఆసీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ గెలుపు గుర్రం బెన్ స్టోక్స్ సిరీస్ కు దూరం కావడంతో ఆసీస్ టోర్నీ ఫేవరేట్ గా బరిలో దిగుతోంది. 

More Telugu News