patanjali: రాందేవ్ బాబా పతంజలికి జరిపిన భూ కేటాయింపుల వివరాలు వెల్లడించిన అధికారులపై బదిలీ వేటు

  • 10,561 కోట్ల టర్నోవర్ కలిగిన పతంజలి సంస్థ
  • 75 శాతం రాయితీతో భూ కేటాయింపులు
  • బయటపెట్టిన సమాచార హక్కు చట్టం అధికారులు

ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ కు కేంద్ర ప్రభుత్వం 75 శాతం రాయితీపై భూముల కేటాయింపు జరిపిన బాగోతాన్ని సమాచార చట్టం అధికారులు గుట్టు రట్టు చేశారు. 10,561 కోట్ల టర్నోవర్ కలిగిన పతంజలి సంస్థ దేశంలోని పెద్ద నగరాలైన నాగ్ పూర్, నోయిడా, ఇండోర్, విజయవాడల్లో మెగాయూనిట్లు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోగా 75 శాతం రాయితీతో భూ కేటాయింపులు చేసింది.

దీనికి సంబంధించిన సమాచారాన్ని హక్కుల కార్యకర్తలు కోరారు. దీంతో అధికారులు నిబంధనల ప్రకారం దానికి సంబంధించిన సమాచారం అందజేశారు. దీంతో అప్పనంగా ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో దీనికి కారణమైన సమాచారచట్టం అధికారులపై సర్కారు బదిలీ వేటు వేసింది. మహారాష్ట్ర ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కంపెనీ మార్కెటింగ్ మేనేజరు అతుల్ ఠాక్రేను నాగపూర్ నుంచి ముంబైకు, మరో మార్కెటింగ్ మేనేజరు సమీర్ గోఖలేను ముంబై నుంచి నాగ్‌ పూర్‌ కు బదిలీ చేశారు.

More Telugu News