varma: ముందుగా నాగ్ మూవీనే .. రెండు నెలల్లో పూర్తి చేయనున్న వర్మ!

  • ఫిబ్రవరి నుంచి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' షూటింగ్ 
  • ఈ లోగా నాగార్జునతో సెట్స్ పైకి 
  • చాలా గ్యాప్ తరువాత నాగ్ చేస్తున్న యాక్షన్ మూవీ 
  • రెండు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసే ఆలోచన

నాగార్జున హీరోగా తాను ఓ సినిమా చేస్తున్నట్టుగా రామ్ గోపాల్ వర్మ చెప్పారు. నాగార్జున కూడా వర్మతో ఒక సినిమా చేయనున్న విషయాన్ని స్పష్టం చేశారు. అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను తెరకెక్కించడానికి కొన్ని రోజులుగా వర్మ సన్నాహాలు చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ సినిమా ముందు మొదలవుతుందన్న విషయంలో కాస్త కన్ఫ్యూజన్ వుంది. తాజాగా ఈ విషయంలో స్పష్టత వచ్చింది.

ముందుగా ఆయన నాగార్జున సినిమానే మొదలెడతాడనేది తాజా సమాచారం. ఫిబ్రవరి నుంచి వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీని మొదలెట్టనున్నారు. ఈ లోగానే నాగ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. తక్కువ బడ్జెట్ తోనే రూపొందే ఈ సినిమాను రెండే నెలల్లో పూర్తి చేయనున్నారని సమాచారం. ఇక ఫిబ్రవరి నుంచి నాగ్ కూడా మల్టీస్టారర్ మూవీపై దృష్టి పెట్టనున్నారు.      

More Telugu News