ang san suchi: రెండో గౌరవం కోల్పోయిన అంగ్ సాన్ సూకీ!

  • ప్రసిద్ధ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ జూనియర్ కామన్ రూం నుంచి అంగ్ సాన్ సూకీ పేరు తొలగింపు
  • ఇప్పటికే సెయింట్ కాలేజీ ప్రవేశ ద్వారం నుంచి ఆమె ఫొటో తీసివేయడం జరిగింది 
  • రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న అకృత్యాలపై నిరసన తెలపడంలో భాగంగా ఆమె పేరు తొలగింపు


మయన్మార్ ఫస్ట్ స్టేట్ కౌన్సిలర్ అంగ్ సాన్ సూకీ రెండో గౌరవాన్ని కోల్పోయారు. మయన్మార్ లో ఏళ్ల తరబడి జరిపిన పోరాటంతో ఆమె ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు అందుకున్నారు. అందులో భాగంగా ప్రసిద్ధ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కాలేజి జూనియర్ కామన్ రూంలో స్థానం సంపాదించారు. తాజాగా ఆమె పేరును విద్యార్థులు జూనియర్ కామన్ రూం నుంచి తొలగించారు.

రఖైన్ స్టేట్ లో రోహింగ్యా ముస్లింలకు అండగా నిలవడంలో విఫలమైనందున ఆమె పేరు తొలగించినట్టు విద్యార్థులు తెలిపారు. రోహింగ్యాలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలను ఆమె నిలువరించలేకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు జూనియర్ కామన్ రూం నుంచి ఆమె పేరును తొలగించారు.

జూనియర్ కామన్ రూంలో స్పూర్తిని రగిలించే ప్రముఖుల ఫోటోలు ఉంచుతారు. అక్కడ జరిగే సంభాషణలు, విద్య ఉత్తమంగా ఉండేలా జూనియర్ విద్యార్థుల్లో స్పూర్తిని రగిలించడంలో భాగంగా ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలు ఇలాంటి జూనియర్ కామన్ రూమ్స్ ను ఏర్పాటు చేస్తాయి. ఇందులో యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లో సభ్యత్వం కలిగిన విద్యార్థులు సభ్యులుగా ఉంటారు.

వారు వేసే ఓట్ల ఆధారంగా ప్రముఖుల ఫోటోలు పెట్టడం లేదా తీసేయడం జరుగుతుంది. అయితే మయన్మార్ నుంచి రోహింగ్యాలు ప్రాణాలరచేతుల్లో పెట్టుకుని వివిధ దేశాలకు తరలిపోతున్న నేపథ్యంలో వారి రక్షణకు ఆమె ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించిన విద్యార్థులు, ఆమె పేరును తొలగించారు. ఇటీవల సెయింట్ హ్యూస్ కాలేజీ ప్రవేశ ద్వారం నుంచి కూడా ఆమె ఫొటోను తొలగించిన సంగతి తెలిసిందే.

More Telugu News